SA Vs WI Test | ట్రినిడాడ్ (పోర్ట్ ఆఫ్ స్పెయిన్): స్వదేశంలో దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టును డ్రా చేసుకునేందుకు వెస్టిండీస్ శ్రమిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలు 357 పరుగులకు ఆలౌట్ కాగా విండీస్ 91.5 ఓవర్లలో 233 పరుగులకే చేతులెత్తేసింది. స్పిన్నర్ కేశవ్ (4/76), పేసర్ రబాడా (3/56) ధాటికి ఆతిథ్య జట్టు బ్యాటర్లు నిలువలేకపోయారు.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 124 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 173/3 వద్ద డిక్లేర్ చేసింది. స్టబ్స్ (68) చెలరేగి ఆడాడు. 298 పరుగుల లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 3.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది.