సౌతాఫ్రికా పర్యటన కోసం భారత జట్టు పయనమైంది. ముంబై నుంచి విమానంలో బయలుదేరిన ఆటగాళ్లు.. తొలుత సేచెలెస్లో ఆగాల్సి వచ్చింది. అక్కడ విమానం ఫ్యూయెల్ నింపుకున్న తర్వాత.. జొహన్నెస్‌బర్గ్‌లోని ఓ.ఆర్. టంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండయ్యారు.
ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియోలను తాజాగా బీసీసీఐ ట్వీట్ చేసింది. వీటిలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా సరదా మూడ్‌లో కనిపించాడు. వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మను ఆటపట్టిస్తూ కెమెరాకు చిక్కాడు. అశ్విన్ సాయంతో ఇషాంత్‌తో తమిళంలో మాట్లాడిన కోహ్లీ.. ఆ తర్వాత అతని బ్యాగుపై ఫోకస్ పెట్టాడు.
‘ఇది కదా బ్యాగంటే. ఈ క్షణం కావాలన్నా సరే ఈ మనిషి ప్రపంచంలో ఏ మూలకైనా పారిపోగలడు. అతనికి కావలసినవన్నీ ఈ బ్యాగులో ఉన్నాయి. ఇలాంటి బ్యాగ్‌ను తొలిసారి చూస్తున్నా. ఈ బ్యాగ్ ఉన్న ఏ ఒక్కరైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా హాలీ డే చేసుకోవచ్చు’ అని కోహ్లీ చెప్పాడు. ఈ జర్నీ మొత్తం మహమ్మద్ సిరాజ్ నిద్రపోతూనే ఉన్నాడని అశ్విన్ చెప్పాడు.
పుజారా మాత్రం తనకు అసలు నిద్ర పట్టలేదన్నాడు. అతని పక్కనే ఉన్న రహానే.. పుజారా తనను సతాయించాడని తెలిపాడు. విమానాశ్రయంలో దిగగానే వీళ్లందరూ నాజల్ స్వాబ్స్ ద్వారా.. ఆర్టీ పీసీఆర్ టెస్టుకు శాంపిల్స్ ఇచ్చి ప్రిటోరియాలోని హోటల్‌కు వెళ్లిపోయారు.
From Mumbai to Jo'Burg! 👍 👍
— BCCI (@BCCI) December 17, 2021
Capturing #TeamIndia's journey to South Africa 🇮🇳 ✈️ 🇿🇦 – By @28anand
Watch the full video 🎥 🔽 #SAvINDhttps://t.co/dJ4eTuyCz5 pic.twitter.com/F0qCR0DvoF
— BCCI (@BCCI) December 16, 2021
All the best team India
— ༒ÄĐ𝕀ƬɎÅ༒ 𒈞𒆜𝕄𝕀𝕊ℍℝ𝔸꧂☯💜 (@Adityam72049066) December 17, 2021
🤧👍👍👍#IndvsSA #Virat#BCCI #Ishant pic.twitter.com/g8gE9kVg8u