రావల్పిండి: పాకిస్థాన్‌తో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ కాస్తా 1-1తో డ్రాగా ముగిసింది. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో పాక్ నిర్దేశించిన 68 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన సఫారీలు 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది.
కెప్టెన్ మార్క్మ్(్ర42) టాప్ స్కోరర్‌గా నిలువగా, ర్యాన్ రికల్టన్(25 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 94/4తో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన పాక్.. సైమన్ హర్మర్ (6/50) ధాటికి 138 పరుగులకే కుప్పకూలింది. హర్మర్ స్పిన్ ధాటికి పాక్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. బాబర్ ఆజమ్ (50) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. మహారాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ముత్తుస్వామికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కింది.