South Africa Squad: త్వరలోనే స్వదేశంలో భారత్‌తో మూడు ఫార్మాట్ల సిరీస్‌లు ఆడనున్న దక్షిణాఫ్రికా వన్డే, టీ20, టెస్టులకు జట్లను ప్రకటించింది. పరిమిత ఓవర్ల సారథిగా చాలాకాలంగా కొనసాగుతున్న టెంబా బవుమాను సఫారీ సెలక్టర్లు పక్కనబెట్టారు. వన్డే వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా రాణించినా వ్యక్తిగతంగా బవుమా ప్రదర్శన మాత్రం అత్యంత చెత్తగా ఉంది. దీంతో క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఎ) వైట్ బాల్ క్రికెట్లో కొత్త సారథిని నియమించింది.
గత కొంతకాలంగా బవుమా లేకుంటే సఫారీ జట్టును నడిపిస్తున్న ఎయిడెన్ మార్క్రమ్ను కొత్త సారథిగా నియమించింది. టీ20, వన్డేలకు అతడే సారథిగా వ్యవహరించనున్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్ మరో ఐదారునెలలోనే ఉండటంతో ఈ ఫార్మాట్‌కు సంబంధించిన ప్లేయర్లనే ఎక్కువగా ఎంపిక చేసింది. కానీ ఆ జట్టు యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌ను మాత్రం పక్కనబెట్టడం గమనార్హం. బవుమాను పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతల నుంచే గాక ఈ రెండు సిరీస్‌ల నుంచి కూడా సీఎస్ఎ తప్పించింది. బవుమాతో పాటు రబాడాను కూడా పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి సెలక్టర్లు రెస్ట్ ఇచ్చారు.
సౌతాఫ్రికా టీ20 జట్టుః ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నిల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్, నండ్రె బర్గర్, గెరాల్డ్ కోయెట్జ్ (తొలి, రెండో టీ20కి మాత్రమే), డొనొవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్ (తొలి, రెండో టీ20కి మాత్రమే), హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి (తొలి, రెండో టీ20కి మాత్రమే), అండిల్ పెహ్లుక్వాయో, తబ్రైజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్
వన్డే జట్టుః ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నిల్ బార్ట్‌మన్, నండ్రె బర్గర్, టోని డి జోర్జి, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, మిహలి ఎంపగ్వానా, డేవిడ్ మిల్లర్, వియాన్ మల్డర్, ఆండిల్ పెహ్లుక్వాయో, తబ్రైజ్ షంసీ, రస్సీ వాన్‌డెర్ డసెన్, కైల్ వెర్రెయెన్, లిజాడ్ విలియమ్స్
టెస్టు జట్టుః టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, నండ్రె బర్గర్, గెరాల్డ్ కొయెట్జ్, టోని డి జోర్జి, డీన్ ఎల్గర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ మల్డర్, లుంగి ఎంగిడి, కీగన్ పీటర్సన్, కగిసొ రబాడా, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయెన్