South Africa : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా(South Africa) ఈడెన్ గార్డెన్స్‌లో చరిత్ర లిఖించింది. దశాబ్దపు కలను సాకారం చేసుకుంటూ భారత్‌కు అనూహ్య ఓటమిని అందించింది సఫారీ జట్టు. అంతేకాదు డబ్ల్యూటీసీ (WTC 2025-27) పట్టికలో టీమిండియాను నాలుగుకు నెట్టేస్తూ.. రెండో స్థానానికి ఎగబాకింది. స్పిన్ ట్రాక్ మీద వికెట్ల వేటతో టీమిండియాను ఒత్తిడిలో పడేసి.. 30 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. కెప్టెన్ తెంబా బవుమా, లెగ్గీ హర్మర్ రాణించడంతో చిరస్మరణీయ విజయం సాధించింది దక్షిణాఫ్రికా. పదిహేనేళ్లలో మొదటి విజయంతో మురిసిపోతున్న పర్యాటక జట్టు.. గతంలో ఐదుసార్లే టీమిండియాను ఓడించింది.
భారత పర్యటనలో పరాజయాలతో వెనుదిరిగే దక్షిణాఫ్రికా ఈసారి విజయంతో మురిసిపోయింది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో టీమిండియాను 93కే ఆలౌట్ చేసి ఆరో విక్టరీ నమోదు చేసింది. అవును.. ఇప్పటివరకూ భారత గడ్డపై సఫారీలకు ఇది ఆరో విజయం మాత్రమే. ఇందులో మూడు ఇన్నింగ్స్ తేడాతో గెలవడం విశేషం. 1996 టెస్టులో మొదటిసారి 329 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
Fifteen years on, South Africa have their sixth Test win in India ✨ pic.twitter.com/nCrvTRcbwB
— ESPNcricinfo (@ESPNcricinfo) November 16, 2025
అనంతరం నాలుగేళ్లకు.. ముంబైలోని వాంఖడేలో భారత్‌కు షాకిస్తూ 4 వికెట్లతో గెలుపొందింది. అదే ఏడాది బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇన్నింగ్స్ 71 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది పర్యాటక జట్టు. మరో నాలుగేళ్ల (2008) తర్వాత అహ్మదాబాద్ టెస్టులో ఇన్నింగ్స్ 90 పరుగులతో భారత్‌ను ఓడించింది. నాగ్‌పూర్‌లో 2010లో జరిగిన టెస్టులో హషీం ఆమ్లా మెరుపులతో ఇన్నింగ్స్ ఆరు పరుగుల తేడాతో గెలిచింది దక్షిణాఫ్రికా. గత పదేళ్లలో ఆ జట్టుకు అదే చివరి విజయమైంది. ఆ తర్వాత రెండు దఫాలు సిరీస్‌లో ఓటమినే చవిచూస్తున్న దక్షిణాఫ్రికా ఈసారి అద్భుతం చేసింది.
డబ్ల్యూటీసీ ఛాంపియన్‌గా నిలిపిన తెంబా బవుమా సారథ్యంలో అదిరే ప్రదర్శనతో మూడో రోజే మ్యాచ్‌ను ముగించింది. బవుమా అర్ధ శతకానికి.. స్పిన్నర్ హార్మర్(4-30, 4-21) సూపర్ స్పెల్ తోడవ్వడంతో 30 రన్స్ తేడాతో చిత్తు చేసి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు నవంబర్ 22న గువాహటిలో జరుగనుంది.
South Africa defeat India in India for the first time in 15 years to take the series lead 🇿🇦 pic.twitter.com/9oqZEm4l0x
— ESPNcricinfo (@ESPNcricinfo) November 16, 2025