RSA vs NED : పొట్టి వరల్డ్ కప్‌లో పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికిస్తున్న దక్షిణాఫ్రికా(South Africa)కు భారీ షాక్. నెదర్లాండ్స్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో సఫారీ జట్టు కష్టాల్లో పడి ఎదురీదుతోంది. డచ్ పేసర్ వివియన్ కింగ్మా(Vivian Kingma) విజృంభణతో 12 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో మొదటి బంతికే ఓపెనర్ క్వింటన్ డికాక్(0) సమన్వయ లోపంతో రనౌట్ అయ్యాడు.
ఆ తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(3)ను వాన్ బీక్ బౌల్డ్ చేశాడు. ఇక ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్(0) సైతం సున్నా చుట్టేయగా.. చిచ్చరపిడుగు హెన్రిచ్ క్లాసెన్(4)ను కింగ్మా బోల్తా కొట్టించాడు. అంతే.. పవర్ ప్లేలో ప్రొటిస్ టీమ్ 4 వికెట్ల నష్టానికి 16 రన్స్ చేసిందంతే. ప్రస్తుతం డేవిడ్ మిల్లర్(1), యువకెరటం ట్రిస్టన్ స్టబ్స్(6)లు ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ఉన్నారు.
A horror start for South Africa to their small chase #NEDvSA #T20WorldCup
▶️ https://t.co/h3vCW9eLCz pic.twitter.com/pvjcCuCG05
— ESPNcricinfo (@ESPNcricinfo) June 8, 2024
న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ స్టేడియంలో నెదర్లాండ్స్ 103 రన్స్ కొట్టింది. మార్కో జాన్సెన్(2/20), అన్రిచ్ నోర్జి(2/19)ల విజృంభణతో 48 రన్స్‌కే డచ్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో సిబ్రాండ్ ఎంగ్లెబ్రెట్చ్(40), లొగన్ వాన్ బీక్(23)లు పట్టుదలగా ఆడారు. ఆఖరి ఓవర్లలో బౌండరీలతో హోరెత్తించిన ఈ జంట హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో ఆదుకుంది. దాంతో, మర్క్రమ్ సేకు నెదర్లాండ్స్ 104 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
Could this be an interesting chase on a tough track? #NEDvSA #T20WorldCup
▶️ https://t.co/h3vCW9eLCz pic.twitter.com/73rZHGTzyL
— ESPNcricinfo (@ESPNcricinfo) June 8, 2024