మార్కెట్లో స్మార్ట్‌వాచ్‌లకు కొదువ లేదు. కానీ, అవన్నీ చూడటానికి ఒకేలా ‘ఫిట్నెస్ ట్రాకర్’లా కనిపిస్తున్నాయని ఫీలవుతున్నారా? అయితే, మీ కోసమే పెబుల్ తన క్లాసిక్ వాచ్‌కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ‘పెబుల్ రౌండ్ 2’ పేరుతో వచ్చిన ఈ కొత్త మాడల్, పాతవెర్షన్లో ఉన్న లోపాలన్నింటినీ తుడిచేసి సరికొత్త ‘స్లీక్’లుక్ తో మార్కెట్లోకి వచ్చేసింది.
స్మార్ట్ వాచ్ అంటే చేతికి గజిబిజిగా ఉండకూడదు అనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఈ వాచ్ డయల్ 8.1 ఎంఎం మందంతో చాలా సన్నగా, స్టయిలిష్‌గా ఉంది. దీనికి వాడిన స్టెయిన్లెస్ స్టీల్ బాడీ.. ప్రీమియం లుక్ ఇచ్చింది. ఇది మ్యాట్ బ్లాక్, బ్రష్డ్ సిల్వర్, షైనీ రోజ్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది. డిస్ప్లే మునుపటి కంటే పెద్దది. అయినా.. స్పష్టంగా కనిపించే ‘ఇ-పేపర్’ డిస్ప్లేను ఇందులో అమర్చారు. పాత వాచ్‌లో ఉన్న ఆ లావుపాటి బోర్డర్లను తీసేసి, స్క్రీన్ మొత్తం క్లియర్‌గా ఉండేలా డిజైన్ చేశారు.
ఆరోగ్య సంరక్షణ: నిద్రను పర్యవేక్షించే స్లీప్ ట్రాకింగ్, అడుగులను లెక్కించే స్టెప్ కౌంటింగ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
బ్యాటరీ బ్యాకప్: ఒకసారి చార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 10 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది.
కనెక్టివిటీ: ఇది అటు ఆండ్రాయిడ్ ఇటు ఐఓఎస్ (iOS) రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. అయితే, మెసేజ్‌లకు రిైప్లె ఇచ్చే ఆప్షన్ మాత్రం కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకే పరిమితం చేశారు.
ధర: సుమారు రూ.16,500