SAW vs BANW : మహిళల వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించేలా ఉంది. పోరాడగలిగే స్కోర్ చేసిన బంగ్లా.. అనంతరం దక్షిణాఫ్రికాను వణికిస్తోంది. స్పిన్నర్లు విజృంభించి.. ఐదు కీలక వికెట్లు తీశారు. 15వ ఓవర్లో లారా వొల్వార్డ్త్ (31) రనౌట్‌తో మొదలు.. ఆరు పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయింది సఫారీ జట్టు. బంగ్లా స్పిన్నర్ ఫాహిమా ఖాతూన్ తొలి బంతికే సినాలో జాఫ్తా(4)ను బౌల్డ్ చేసి ఐదో వికెట్ అందించింది. ప్రస్తుతం మరినే కాప్ (13), చొలే ట్రయాన్(4)లు క్రీజులో ఉన్నారు. 24 ఓవర్లకు స్కోర్. 85-5. ఇంకా దక్షిణాఫ్రికా విజయానికి 147 పరుగులు కావాలి.
వైజాగ్‌లో బంగ్లాదేశ్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో దక్షిణాఫ్రికా తడబడుతోంది. ఆరంభంలోనే నహిదా అక్తర్ ఓవర్లో ఓపెనర్ తంజిమ్ బ్రిస్త్ (0) ఆమెకే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత కెప్టెన్ లారా వొల్వార్డ్త్(31), అనెకే బాస్చ్(28)లు ఇన్నింగ్స్ నిర్మించారు. పవర్ ప్లేలో బౌండరీతో చెలరేగి బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టారు. వీరిద్దరి జోరుతో ఒకదశలో 58/1తో పటిష్ట స్థితిలో ఉన్న సఫారీ జట్టు చూస్తుండగానే వరుసగా వికెట్లు కోల్పోయింది.
Another one goes and Bangladesh are on top in this contest! SA are 71 for 4 after 20 overs https://t.co/lIlKhJEcdK https://t.co/2JkVqXKvnE
— ESPNcricinfo (@ESPNcricinfo) October 13, 2025
15వ ఓవర్లో రెండో పరుగు తీయడంపై సందిగ్థతతో కెప్టెన్ లారా వొల్వార్డ్త్ రనౌటయ్యింది. ఆ తర్వాత రీతూ ఓవర్లో బాస్చ్ మిడాఫ్‌లో శోభన చేతికి చిక్కింది. నాలుగు పరుగుల తేడాతో ఇద్దరు ప్రధాన బ్యాటర్లు ఔట్ కావడంతో బంగ్లా ఆశలు చిగురించాయి. అప్పటికే షాక్‌లో ఉన్న దక్షిణాఫ్రికాను రబెయా ఖాన్ దెబ్బకొట్టింది. సూపర్ డెలివరీతో అనెరీ డెర్క్సన్(2)ను బౌల్డ్ చేసింది. దాంతో.. 64 పరుగులకే సఫారీ జట్టు నాలుగో వికెట్ పడింది. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే సినాలో జాఫ్తా(4)ను ఫాహిమా బౌల్డ్ చేయగా.. ఐదో వికెట్ కోల్పోయింది దక్షిణాఫ్రికా.