కోల్‌కతా: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలను భారత బౌలర్లు చిక్కుల్లో పడేశారు. 71 రన్స్‌కే 3 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా (IND vs SA) టాపార్డర్‌ను కుప్పకూల్చారు. కోల్‌కతాలో జరుగుతున్న మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 10.3 ఓవర్లో రికెల్టన్ను (23) క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన బవుమా ఆచితూచి ఆడుతుండగా, మరోఎండ్‌లో ధాటిగా ఆడుతున్న మార్క్రమ్ను బుమ్రా ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ 12.1వ ఓవర్లో 31 రన్ చేసిన మార్క్రమ్ వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్‌కు చేరాడు.
ఇక కెప్టెన్ బవుమాను (3) కుల్దీప్ బుట్టలోపడేశాడు. 15వ ఓవర్ చివరి బంతికి జురెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో 3 వికెట్ల నష్టానికి 75 రన్స్చేసింది. ప్రస్తుతం వియాన్ ముల్డర్, క్రీజ్‌లో ఉన్నారు. బుమ్రా 2 వికెట్లు తీసుకోగా, కుల్దీప్కు ఒక వికెట్ దక్కింది.