కోల్‌కతా: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు(INDvSA)లో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. తాజా సమాచారం ప్రకారం సౌతాఫ్రికా 35 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 రన్స్ చేసింది. భారత బౌలర్లు బుమ్రా, కుల్దీప్లు.. సఫారీలను కట్టిపడేశారు. ఆ ఇద్దరు కలిపి ఇప్పటికే 5 వికెట్లు తీసుకున్నారు. తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు.. ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇచ్చారు. మార్క్రమ్, రికల్టన్లు తొలి వికెట్‌కు 57 రన్స్ జోడించారు. కానీ ఆ తర్వాత సఫారీ బ్యాటర్లు క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. వరుసగా వికెట్లను కోల్పోయారు. భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో సౌతాఫ్రికా బ్యాటర్లు విఫలం అయ్యారు. మార్క్రం 31, రికల్టన్23, ముల్డర్ 24, టొనీ 24 రన్స్ చేసి ఔటయ్యారు.