PAKW vs SAW : మహిళల ప్రపంచ కప్ మ్యాచ్‌లకూ వేదికైన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మళ్లీ వరుణుడిదే పైచేయి అయింది. మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దుకాగా.. పాకిస్థాన్, న్యూజిలాండ్ పోరు కూడా సాధ్యపడలేదు. దాంతో.. అంపైర్లు మ్యాచ్ రద్దు చేయడంతో దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. హ్యాట్రిక్ విజయాలు సాధించిన లారా వొల్వార్డ్త్ బృందం 8 పాయింట్లతో రెండో బెర్తు దక్కించుకుంది. ఫలితంగా చివరి రెండు బెర్తుల కోసం ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొంది.
మహిళల ప్రపంచ కప్‌లో మరో మ్యాచ్ వరుణుడిఖాతాలో చేరింది. శనివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో వర్షం అంతరాయం నడుమ సాగిన పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ చివరకు రద్దయ్యింది. మొదట 12.2 ఓవర్ వద్ద మొదలైన వాన.. ఆ తర్వాత 25వ ఓవర్ పూర్తికాగానే మరోసారి అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో.. అంపైర్లు మ్యాచ్ రద్దు చేసి పాక్, వైట్ ఫెర్న్స్‌కు చెరొక పాయింట్ కేటాయించారు. దాంతో.. వరుసగా నాలుగు విజయాలతో 8 పాయింట్లు కలిగిన దక్షిణాఫ్రికా సెమీఫైనల్లో అడుగుపెట్టింది.
A fourth no result in Colombo this World Cup 🙁🌧️
Points table: https://t.co/vzn5HfdAYk pic.twitter.com/bSmPdJcT7D
— ESPNcricinfo (@ESPNcricinfo) October 18, 2025
ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లను రద్దయ్యేలా చేసి కో హోస్ట్ శ్రీలంకను దెబ్బకొట్టిన వరుణుడు ఈసారి న్యూజిలాండ్, పాకిస్థాన్ మ్యాచ్‌కూ అడ్డుపడ్డాడు. వర్ష సూచనతో మ్యాచ్‌పై సందేహాల నడుమ ఇరుజట్లు మైదానంలోకి దిగాయి. ఊహించినట్టే.. పాక్ ఇన్నింగ్స్ 12.2 ఓవర్ వద్ద వర్షం మొదలైంది. అప్పటికీ పాక్ స్కోర్. 52-3. గంటన్నర తర్వాత చినుకులు తగ్గడంతో.. గబగబా సూపర్ సాపర్స్ సాయంతో ఔట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేశారు. అయితే.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఓవర్లు కుందించి.. 46 ఓవర్ల ఆటకు ఓకే చెప్పారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ తిరిగి ఆరంభించిన పాక్ మరో రెండు వికెట్లు కోల్పోయింది. అలియా రియాజ్(28 నాటౌట్), సిద్రా నవాజ్(6 నాటౌట్)లు ఆచితూచి ఆడుతూ స్కోర్ 90 దాటించారు.
25 overs in, and the rain makes a dreaded return 😩 Pakistan are 95 for 4 🌧️
Scorecard: https://t.co/p1H0nyNnj2 | #PAKvNZ pic.twitter.com/qeFNTrIkq0
— ESPNcricinfo (@ESPNcricinfo) October 18, 2025
కానీ, 25వ ఓవర్ తర్వాత మరోసారి అంతరాయం కలిగించాడు. అప్పటికి పాక్ స్కోర్.. 92/5. కాసేపటికి వరుణుడు శాంతించడంతో ఇరుజట్లకు 36 ఓవర్లు కేటాయించారు. ఇక మ్యాచ్ ప్రారంభకావడమే ఆలస్యం అనుకుంటుండగా.. వర్షం మళ్లీ మొదలైంది. కట్ ఆఫ్ సమయం 9:40 వరకూ ఉన్నప్పటికీ.. తడి ఔట్ ఫీల్డ్ కారణంగా మ్యాచ్ అసాధ్యమని తేల్చారు అంపైర్లు. ఇరుజట్ల కెప్టెన్లతో మాట్లాడి మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు తెలిపారు. దాంతో.. నాలుగో విజయంతో సెమీస్ చేరాలనుకున్న న్యూజిలాండ్‌కు.. విజయంతో టాప్ -5లోకి రావాలనుకున్న పాక్ జట్లకు నిరాశే మిగిలింది.
No result between Pakistan and New Zealand in Colombo means South Africa are the second team to qualify for the semi-final of the ODI World Cup 🇿🇦
Points table ▶️ https://t.co/vzn5HfdAYk pic.twitter.com/xXEcbxNnwx
— ESPNcricinfo (@ESPNcricinfo) October 18, 2025