Manchu Vishnu | మంచు విష్ణు వ్యవహారంపై మా సభ్యుల అసంతృప్తి .. ఎన్నికలు కోరుతున్న నాయకులు..!
Manchu Vishnu | సినీ పరిశ్రమలో కీలక సంస్థ అయిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) శనివారం నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్ తీవ్ర చర్చలకు వేదికైంది. గత నాలుగేళ్లుగా మా అధ్యక్షుడిగా కొనసాగుతున్న మంచు విష్ణు పదవి కాలం ఇప్పటికే ముగిసినా, కొత్త మా భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయనే కొనసాగాలనే తీర్మానం చేశారట.
Manchu Vishnu | సినీ పరిశ్రమలో కీలక సంస్థ అయిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) శనివారం నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్ తీవ్ర చర్చలకు వేదికైంది. గత నాలుగేళ్లుగా మా అధ్యక్షుడిగా కొనసాగుతున్న మంచు విష్ణు పదవి కాలం ఇప్పటికే ముగిసినా, కొత్త మా భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయనే కొనసాగాలనే తీర్మానం చేశారట. దీని ప్రకారం ఇప్పటివరకు బాధ్యతల్లోనే ఉన్నారు. అయితే భవనం నిర్మాణంపై స్పష్టత లేకపోవడం వల్ల సభ్యుల్లో అసంతృప్తి పెరిగింది. సభలో పలువురు సభ్యులు భవనం నిర్మాణం ఎంతవరకు వచ్చిందన్న దానిపై స్పష్టమైన సమాచారాన్ని కోరగా, దీనిపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. భవనం నిర్మాణం పేరుతో అధ్యక్ష పీఠం ఆక్రమించుకుని ఉండడం సబబా అనే ప్రశ్నలూ వెల్లువెత్తాయి.
చర్చల్లో పాల్గొన్న పలువురు సభ్యులు మంచు విష్ణు, ఆయన టీమ్‌పై అసంతృప్తిని వెల్లగక్కారు. ఇప్పటికే సభ్యుల పదవీ కాలం దాటిపోయినందున, తక్షణమే నూతన ఎన్నికలు నిర్వహించాలంటూ పలువురు బలంగా డిమాండ్ చేసినట్లు సమాచారం. సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే జనరల్ బాడీ మీటింగ్‌లో గత కాలంలో జరిగిన అన్ని ఆర్థిక లావాదేవీలను పరిశీలించాలి అన్నది ప్రధాన చర్చాంశంగా మారింది. మే నెలలో ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు తీసుకోవాలని నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఈసారి ఎన్నికల్లో పోటీతీరు కాకుండా, ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
సభలో జరిగిన చర్చల్లో భాగంగా, ఎవరైనా అగ్ర హీరో ముందుకు వస్తే, ఆయనను మా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సభ్యులు సిద్ధంగా ఉన్నట్లు టాక్. అయితే గతంలో జరిగిన రాజకీయాలు, వివాదాల నేపథ్యంలో అగ్ర హీరోలు ముందుకు వస్తారా అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. మరోవైపు మంచు విష్ణు ఈ చర్చలపై ఎలా స్పందిస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మా భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు కొనసాగాలనే నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందా? లేదా త్వరలోనే కొత్త ఎన్నికలు ప్రకటిస్తారా? అన్న అంశాలపై సభ్యుల్లో ఆసక్తి నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

