Dowry Death | పవిత్ర వివాహ బంధం వ్యాపార లావాదేవీగా దిగజారింది.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Dowry Death | భార్య వరకట్న మరణం కేసులో భర్తకు మంజూరైన బెయిల్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. వరకట్న మరణం సమాజానికి వ్యతిరేకంగా జరిగే నేరమని వివరించింది.
Dowry Death | న్యూఢిల్లీ: భార్య వరకట్న మరణం కేసులో భర్తకు మంజూరైన బెయిల్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. వరకట్న మరణం సమాజానికి వ్యతిరేకంగా జరిగే నేరమని వివరించింది. పవిత్ర వివాహ బంధం వ్యాపార లావాదేవీ స్థాయికి దిగజారిపోవడం శోచనీయమని వ్యాఖ్యానించింది.
వరకట్న దురాచారం వివాహం పవిత్రతకు విఘాతం కలిగించడం మాత్రమే కాకుండా వ్యవస్థీకృతంగా మహిళల అణచివేతను శాశ్వతం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసింది. వరకట్నం కోసం డిమాండ్లు హేతుబద్ధత సరిహద్దులను అతిక్రమించినపుడు, క్రూరత్వంగా పరిణమించినపుడు, వధువు అకాల మరణానికి దారి తీసినపుడు, ఆ నేరం ఆ కుటుంబ వ్యక్తిగత పరిధిని దాటిపోయి, సాంఘిక నేర స్వభావాన్ని సంతరించుకుంటుందని తెలిపింది.
వ్యక్తిగత విషాదంగా మిగిలిపోకుండా, సామాజిక సమష్టి ఆత్మకు అవమానంగా మారుతుందని వివరించింది. తాజా కేసుకు సంబంధించి యోగేంద్ర పాల్ సింగ్ కుమార్తె వివాహం జరిగిన 4 నెలలకే 2023 జూన్ 5న మరణించారు. ఆమెకు ఆమె భర్త రాఘవేంద్ర సింగ్ విషపదార్థాన్ని ఇవ్వడంతో ఆమె మరణించినట్టు తండ్రి ఆరోపించారు. అలహాబాద్ హైకోర్ట్ రాఘవేంద్రకు 2025 జనవరి 9న బెయిల్ మంజూరు చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ యోగేంద్ర సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు బెయిల్‌ను రద్దు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

