Laura Wolvaardt | మూడు ఫార్మాట్లలో ‘సెంచరీ’.. చరిత్ర సృష్టించిన సఫారీ కెప్టెన్
Laura Wolvaardt : దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్డ్త్(Laura Wolvaardt) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన మూడో క్రికెటర్‌గా సఫారీ సారథి చరిత్ర సృష్టించింది.
Laura Wolvaardt : భారత పర్యటనను ఓటమితో ముగించిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్డ్త్(Laura Wolvaardt) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. టీమిండియాతో చెపాక్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టులో లారా శతక గర్జన చేసింది. తద్వారా మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన మూడో క్రికెటర్‌గా సఫారీ సారథి చరిత్ర సృష్టించింది.
అంతర్జాయ క్రికెట్లో వన్డే, టీ20, టెస్టుల్లో వంద కొట్టిన మూడో మహిళా క్రికెటర్‌గా లారా రికార్డు నెలకొల్పింది. ఆమె కంటే ముందు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు హీథర్ నైట్ (Heather Knight), టమ్మీ బ్యూమంట్(Tammy Beaumont)లు మూడు ఫార్మాట్లలో సెంచరీలు బాదేశారు. ఇది వరకూ వన్డే, టీ20ల్లో సెంచరీ బాదేసిన లారా.. ఇప్పుడు టెస్టు శతకంతో ఈ అరుదైన క్లబ్లో లారా చోటు దక్కించుకుంది.
A hundred in all three women’s international formats 💯
Laura Wolvaardt becomes only third player (after Heather Knight and Tammy Beaumont) to reach the landmark 👏 https://t.co/07jDs5UymW #INDvSA pic.twitter.com/pR8ngnvpln
— ESPNcricinfo (@ESPNcricinfo) July 1, 2024
సెంచరీతో చెలరేగినా..
భారత పర్యటనలో లారా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా ఘోర ఓటమి మూటగట్టుకుంది. మూడు వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోయిన సఫారీ జట్టు ఏకైక టెస్టులోనూ గెలవలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌ను భారత జట్టు 603 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా ఆ తర్వాత స్నేహ్ రానా(8/77) దెబ్బకు సఫారీ బ్యాటర్లు చేతులెత్తేశారు.
Shafali Verma and Smriti Mandhana powered India ahead, and Sneh Rana ensured their advantage never slipped https://t.co/07jDs5UymW #INDvSA pic.twitter.com/bglWGCUk7c
— ESPNcricinfo (@ESPNcricinfo) July 1, 2024
ఫాలో ఆన్ ఆడిన రెండో ఇన్నింగ్స్‌లో లారా(122), సునే లస్(109)లు సెంచరీలతో చెలరేగినా జట్టును గట్టెకించలేకపోయారు. స్నేహ్ రానా(8/77, 2/111) సంచలన బౌలింగ్‌తో నాలుగో రోజే హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం జయభేరి మోగించింది. 37 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించి.. 10 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది.
ఇవి కూడా చదవండి
- KTR | నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ అల్టిమేటం
- MLA Krishna Rao | యువత క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలి : ఎమ్మెల్యే కృష్ణారావు
- New Criminal Laws | కొత్త మూడు క్రిమినల్ చట్టాలు.. రెండు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదు..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

