South Africa : దక్షిణాఫ్రికా జట్టు వన్డే క్రికెట్(ODI Cricket)లో సరికొత్త చరిత్ర సృష్టించింది. 50 ఓవర్ల ఆటలో రికార్డు స్థాయిలో ఏడోసారి 400లకు పైగా స్కోర్ చేసింది. దాంతో, ఈ ఫార్మాట్లో భారత జట్టు(Team India) నెలకొల్పిన ప్రపంచ రికార్డును సఫారీ జట్టు బద్ధలు కొట్టింది. ఇండియా ఇప్పటి వరకూ 6 సార్లు 400లకు పైగా పరుగులు చేసింది.విధ్వంసక బ్యాటర్ హెన్రిచ్ క్లాసెస్(174 : 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్స్‌లు), డేవిడ్ మిల్లర్(82 : 45 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడడంతో ఆస్ట్రేలియా(Australia)పై 416 పరుగులు కొట్టింది.
సెంచూరియన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్ డికాక్(45), వాన్ డెర్ డస్సెన్(62) వీరబాదుడుకు క్లాసెన్ తోడయ్యాడు. ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో స్టన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడిన క్లాసెన్ అయితే ఆసీస్ బౌలర్లపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డాడు.
A knock to remember for the ages…
Take a bow, Heinrich Klaasen 🙌#SAvAUS pic.twitter.com/DMfLvAruF5
— ICC (@ICC) September 15, 2023
దొరికిన బంతిని దొరికినట్టు స్టాండ్స్‌లోకి పంపిన అతను కేవలం 57 బంతుల్లోనే వందకు చేరువయ్యాడు. తుఫాన్‌ను తలపించిన అతడు 83 బంతుల్లోనే 13 ఫోర్లు, 13 సిక్స్‌లతో 174 రన్స్ బాదాడు. అతడికి డేవిడ్ మిల్లర్(80) సహకారం అందించాడు. దాంతో, సఫారీ జట్టు 8 వికెట్ల నష్టానికి 416 రన్స్ కొట్టింది.
ఆసీస్‌పై సూపర్ సెంచరీ బాదిన క్లాసెన్ పలు రికార్డులు నెలకొల్పాడు. అవేంటంటే..?
ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 13 సిక్స్‌లు కొట్టిన రెండో దక్షిణాఫ్రికా బ్యాటర్.
వన్డేల్లో సఫారీ జట్టు తరఫున వేగవంతమైన శతకం బాదిన ఐదో క్రికెటర్.
50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక స్కోర్ చేసిన 8వ దక్షిణాఫ్రికా ఆటగాడు.
ఆస్ట్రేలియాపై ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన రెండో సఫారీ ప్లేయర్.