సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడవ టెస్టులో సౌతాఫ్రికా బ్యాటర్ సారల్ ఎర్వీ అనూహ్య రీతిలో ఔటయ్యాడు. స్పిన్నర్ నాథన్ లియాన్ వేసిన ఆఫ్ స్టంప్ బంతిని.. బ్యాటర్ ఎర్వీ వదిలేశాడు. ఆఫ్ సైడ్‌లో పడ్డ ఆ బంతిని వదిలేయాలని ఎర్వీ డిసైడ్ అయ్యాడు. అయితే పిచ్‌పై పడ్డ ఆ బంతి అనూహ్యంగా టర్న్ తీసుకుని వికెట్ల మీదకు వెళ్లింది. దీంతో ఎర్వీ తన వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. గుడ్‌లెన్త్‌లో పడ్డ బంతి ఎలా ఆఫ్ స్టంప్‌ను ఢీకొట్టిందో వీడియోలో చూడాల్సిందే.
A shocker of a leave from Sarel Erwee!
Nathan Lyon can't believe his luck! #OhWhatAFeeling #AUSvSA | @Toyota_Aus pic.twitter.com/twzw5SW2Ty
— cricket.com.au (@cricketcomau) January 7, 2023
మరో వైపు సౌతాఫ్రికా ఇవాళ తన తొలి ఇన్నింగ్స్‌లో నాలుగువ రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 475 రన్స్ వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా ఇంకా 326 రన్స్ వెనుకంజలో ఉంది. ఆదివారం చివరి రోజు కావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.