మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండవ టెస్టులో సౌతాఫ్రికా తన మొదటి ఇన్నింగ్స్‌లో 189 రన్స్‌కు ఆలౌటైంది. ఆసీస్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ 5 వికెట్లు తీశాడు. తొలుత టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్.. సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే ఎంసీజీ పిచ్‌పై సఫారీలు తడబడ్డారు. ఓ దశలో 67 పరుగులకే సౌతాఫ్రికా అయిదు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కైల్ వెరియన్నే, మార్కో జేన్సన్లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. కైల్ 52, మార్కో 59 రన్స్ చేసి ఔటయ్యారు.
ఇక ఆ తర్వాత కెమరూన్ గ్రీన్ విజృంభించాడు. 27 పరుగులు ఇచ్చి అతను తన ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 45 రన్స్ చేసింది. ఉస్మాన్ ఖాజా ఔటయ్యాడు. వందో టెస్టు ఆడుతున్న వార్నర్ 32 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు.
🔹 Most expensive 🇦🇺 player ever at the IPL
🔹 Claims maiden five-wicket haul in TestsAll inside three days?! Cameron Green is ready for the New Year’s bash 🎉#AUSvSA #WTC23 pic.twitter.com/JeERmP6KPZ
— ICC (@ICC) December 26, 2022