కోల్‌కతా: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు(INDvSA) తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 159 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. ఫాస్ట్ బౌలర్ బుమ్రా 27 రన్స్ ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా స్పీడ్ ధాటికి సఫారీలు చేతులెల్తేశారు. సౌతాఫ్రికాలో ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు ఆశించినట్లుగా రాణించలేదు. ఓపెనర్లు స్టార్ట్ ఇచ్చినా.. అదే జోరును కొనసాగించలేకపోయారు. 57 రన్స్‌కు తొలి వికెట్‌ను కోల్పోయిన ఆ జట్టు.. ఆ తర్వాత కేవలం మరో 102 పరుగుల్లో 9 వికెట్లను చేజార్చుకున్నది. తొలి రోజు కేవలం 55 ఓవర్లు మాత్రమే ఆడింది దక్షిణాఫ్రికా. టెస్టుల్లో బుమ్రా అయిదు వికెట్లు తీసుకోవడం ఇది 16వసారి. భారత బౌలర్లలో సిరాజ్, కుల్దీప్లు రెండేసి వికెట్లు తీసుకున్నారు.
Innings Break!
5⃣-fer for Jasprit Bumrah 🫡
2⃣ wickets each for Mohd. Siraj and Kuldeep Yadav 👏
1⃣ wicket for Axar Patel 👌A magnificent bowling effort!
Scorecard ▶️ https://t.co/okTBo3qxVH#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/Hkrb5nzbeZ
— BCCI (@BCCI) November 14, 2025