ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Jan 30, 2021 , 00:47:01

నిలకడగా గంగూలీ ఆరోగ్యం

నిలకడగా గంగూలీ ఆరోగ్యం

కోల్‌కతా: రెండోసారి యాంజియోప్లాస్టీ చేయించుకున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే శుక్రవారం ఆయనకు మరిన్ని వైద్య పరీక్షలు చేయనున్నట్టు దాదాకు చికిత్స చేస్తున్న దవాఖాన సీనియర్‌ డాక్టర్‌ ఒకరు చెప్పారు. ధమనుల్లోని పూడికలను క్లియర్‌ చేసేందుకు గురువారం గంగూలీకి వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి రెండు స్టెంట్లు వేశారు. బుధవారం ఛాతి నొప్పి రావడంతో దాదా దవాఖానలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదట్లో ఓ స్టెంట్‌ వేయించుకున్న గంగూలీకి ఇప్పుడు రెండోసారి యాంజియోప్లాస్టీ జరిగింది. 


VIDEOS

logo