ఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్‌లో జపాన్ ఆతిథ్యమివ్వనున్న 20వ ఆసియా క్రీడల ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ దక్కించుకుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 04 దాకా జరుగబోయే ఈ మెగా ఈవెంట్‌ను భారత్‌లో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ చానెల్స్ ద్వారా వీక్షించొచ్చు. నిరుడు ఆసియా క్రీడల్లో రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించిన భారత్.. ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచాలనే లక్ష్యంతో ఉంది.