Sonny Baker : దేశం తరఫున అరంగేట్రానికి ముందే ఇంగ్లండ్ యువ పేసర్ సొన్ని బేకర్ (Sonny Baker) అదరగొట్టాడు. ఈమధ్యే దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికైన అతడు తన బౌలింగ్ పవర్ చూపిస్తూ ‘ది హండ్రెడ్ లీగ్’లో హ్యాట్రిక్ (Hattrick)తో మెరిశాడు. స్వదేశంలో జరుగుతున్న హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ (Manchester Originals)కు ప్రాతినిధ్యం వహిస్తున్న బేకర్ ఆదివారం మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేశాడు. సూపర్ ఛార్జర్స్ బ్యాటర్లను వణికిస్తూ మూడు వికెట్లతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. మాంచెస్టర్ టీమ్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించిన బౌలర్‌గా బేకర్ రికార్డు సృష్టించాడు.
టీనేజ్ నుంచే సంచలన బౌలింగ్‌తో వార్తల్లో నిలిచిన సొన్ని బేకర్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో ఆదివారం రెచ్చిపోయాడు. విజయం దిశగా దూసుకెళ్తున్న సూపర్ ఛార్జర్స్‌కు ఊహించని ఓటమి అందించాడు. వంద బంతుల మ్యాచ్‌లో తొలుత డేవిడ్ మలాన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఈ స్పీడ్‌స్టర్.. అనంతరం 86వ బంతికి టామ్ లావెస్, 87వ బంతికి జాకబ్ డఫ్ఫీలను ఔట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. దాంతో.. 172 పరుగుల ఛేదనలో విజయానికి చేరువైన సూపర్ ఛార్జర్స్ జట్టు 114కే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో మాంచెస్టర్ జట్టు 57 పరుగుల తేడాతో గెలుపొందింది.
And that’s that! ✅
Sonny Baker finishes the match off and Manchester Originals make it two wins at the Northern derby! 👏#TheHundred pic.twitter.com/YGGASWsN6V
— The Hundred (@thehundred) August 17, 2025
ది హండ్రెడ్ లీగ్‌లో హ్యాట్రిక్ సాధించిన నాలుగో బౌలర్‌గా అవతరించాడు బేకర్. అతడి కంటే ముందు ఇమ్రాన్ తాహిర్(Imran Tahir), టైమల్ మిల్స్, సామ్ కరన్(Sam Curran)లు హ్యాట్రిక్ వీరులుగా రికార్డు సృష్టించారు. 2021లో బర్మింగ్హమ్ పీనిక్స్ తరఫున తాహిర్ వరుసగా మూడు వికెట్లతో చెలరేగాడు. మిల్స్ 2023లో సదర్న్ బ్రేవ్ తరఫున, సామ్ కరన్ నిరుడు ఓవల్ ఇన్విసిబుల్ జట్టు ప్లేయర్‌గా హ్యాట్రిక్ నమోదు చేశారు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా జట్టు మూడు వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ పర్యటనకు రానుంది. దేశవాళీలో గొప్పగా రాణిస్తున్న బేకర్‌ను సెలెక్టర్లు వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. అతడు తొలి వన్డేలో దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నాడు.
A fantastic bowling performance from Sonny Baker! 🔥
He takes 3️⃣ wickets for 1️⃣7️⃣ runs! 👏#TheHundred pic.twitter.com/y4Nh90E0tl
— The Hundred (@thehundred) August 17, 2025