కురవి, ఏప్రిల్ 1 : మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని బేగావత్ సోనియా 69వ ఎస్జీఎఫ్ అండర్-17 బాలికల రగ్బీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. గత నంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు డోర్నకల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న సోనియా.. అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం సత్యనారాయణచారి, ఫిజికల్ డైరెక్టర్ దార్ల సునీల్ తెలిపారు.
ఈ నెల 5 నుంచి 8 తేదీ వరకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో జరిగే జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో సోనియా పాల్గొంటుందని వెల్లడించారు.