న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ తండ్రయ్యాడు. యువీ భార్య హజెల్ కీచ్ మంగళవారం పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా యువీ అభిమానులతో పంచుకున్నాడు. ‘నా అభిమానులు, స్నేహితులు, కుటుంబసభ్యులకు శుభవార్త. మాకు బాబు పుట్టాడు. ఇంతటి ఆనందాన్నిచ్చిన భగవంతుడికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా గోప్యతకు భంగం కల్గించకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని యువీ సందేశాన్ని రాసుకొచ్చాడు. బాలీవుడ్ నటి హజెల్ను 2016లో యువరాజ్ పెండ్లి చేసుకున్నాడు.