శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Aug 31, 2020 , 15:20:28

కొన్నిసార్లు విజయాలు నెత్తికెక్కుతాయి : శ్రీనివాసన్

కొన్నిసార్లు విజయాలు నెత్తికెక్కుతాయి : శ్రీనివాసన్

సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్‌రైనా ఐపీఎల్‌2020 నుంచి నిష్ర్కమించాలని నిర్ణయించుకున్న తరువాత సీఎస్‌కే యజమాని శ్రీనివాసన్‌ తొలిసారి స్పందించారు. ‘రైనా ఏ కారణం చేతనైనా టోర్నీ నుంచి వెళ్లవచ్చు. కానీ అతడు పెద్దమొత్తంలో నష్టపోతాడు. కొన్నిసార్లు విజయాలు నెత్తికెక్కుతాయ’ని శ్రీనివాసన్‌ రైనాను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సీజన్ ఇంకా ప్రారంభం కాలేదు. రైనా ఖచ్చితంగా అతను ఏం కోల్పోతున్నాడో తెలుసుకుంటాడు. అతడి వార్షిక ఆదాయం రూ.11 కోట్లను రైనా కోల్పోనున్నాడ’ని శ్రీనివాసన్‌ అన్నారు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లతో సహా సిబ్బందికి కరోనా సోకి జట్టు గంగరగోళంలో ఉండగా.. రైనా ఆకస్మిక నిర్ణయం సీఎస్‌కేను ఆలోచనలో పడేసింది. ఈ విషయమై శ్రీనివాసన్ కఠినమైన వ్యాఖ్యలు చేశారు.

‘నా ఆలోచన ఏమిటంటే..  మీరు అయిష్టంగా, సంతోషంగా లేకుంటే నిర్మొహమాటంగా వెళ్లిపోవచ్చు. నేను ఎవరినీ బలవంతం చేయను. కాన్నిసార్లు విజయాలు నెత్తికెక్కుతాయి. నాకైతే మంచి కెప్టెన్‌ దొరికాడు. అతడు దేనికీ భయపడడు. జట్టులో అందరు ఆటగాళ్లతో మాట్లాడి నమ్మకం కలిగిస్తున్నాడ’ని శ్రీనివాసన్‌ అన్నారు. 

ఆగస్టు 21న రైనా జట్టుతో యూఏఈ చేరిన తరువాత దుబాయ్‌లో సీఎస్‌కే మేనేజ్‌మెంట్ తనకు ఇచ్చిన వసతి గది నచ్చకనే రైనా టోర్నీ నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. రైనా గదిలో సరైన బాల్కనీలు లేవని, సురక్షిత వాతావరణం లేకనే రైనా అలిగి వెళ్లిపోయినట్లు తెలిసింది. మొదట వ్యక్తిగత కారణాల వల్ల రైనా వెళ్లిపోయాడనే వార్తలు వచ్చినా.. ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మొదటి స్థానంలో విరాట్‌ కోహ్లి ఉండగా.. రెండో స్థానంలో రైనా ఉన్నాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo