ముంబై : విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహ వార్షికోత్సవంలో స్నేక్స్ డిన్నర్ ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా! ఫిట్నెస్ను కాపాడుకునే విషయంలోముందుండే విరుష్క.. నాన్‌వెజ్ తినడమేంటని అనుకుంటున్నారా. సరిగ్గా ఆరేండ్ల క్రితం జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రముఖ చెఫ్ హర్ష్ దీక్షిత్ తాజాగా మీడియాతో పంచుకున్నాడు. డిసెంబర్ 2019లో వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొంత మంది ఎంపిక చేసిన అతిథులకు విరుష్క ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.
‘పూర్తి వేగాన్ అయిన విరాట్, అనుష్క కోసం వియత్నాంకు చెందిన ఒక డిష్ చేద్దామనుకున్నా. మామూలుగా సంప్రదాయక వియత్నాం వంటలో నాన్‌వెజ్ పదార్థాలు వాడుతారు. ఇందులో చికెన్, బీఫ్ రసంతో పాటు స్నేక్ వైన్, మాంసం ఉంటాయి. కానీ పూర్తి శాఖహారులైన విరుష్క కోసం రైస్ నూడుల్స్‌తో పాటు పొట్లకాయ, సంప్రదాయక ఫో, గ్లుటెన్ ఫ్రీ పదార్థాలతో డిష్ తయారు చేశాను’అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే లండన్ వీధుల్లో నెరిసిన గడ్డంతో కోహ్లీ కనిపించిన ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల వింబుల్డన్‌కు హాజరైన కోహ్లీ..ఇలా కనిపించడంపై పలువురు ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు.