Smriti Mandhana : భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) ఆటకు ఫిదా అవ్వని వారుండరు. పవర్ హిట్టింగ్తో చెలరేగిపోయే ఈ లెఫ్ట్ హ్యాండర్ కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. దుబాయ్‌లో క్రికెట్ అకాడమీ ప్రారంభించిందీ స్టార్ క్రికెటర్. లండన్‌కు చెందిన కోచ్ డాన్ భగవతితో కలిసి ‘సిటీ క్రికెట్ అకాడమీ’ని తెరిచింది. ప్రపంచ స్థాయి వసతులతో ఏర్పాటు చేసిన ఈ అకాడమీలో భావి క్రికెట్ తారలను తయారుచేయనుంది.
మామూలుగా అయితే రిటైర్మెంట్ తర్వాత కోచింగ్, క్రికెట్ అకాడమీ గురించి ఆలోచిస్తారు ఎవరైనా. కానీ, తన లక్ష్యాల పట్ల స్పష్టతతో ఉన్న మంధాన మాత్రం కెరియర్ గొప్పగా సాగుతున్న దశలోనే అకాడమీ ఆలోచన చేసింది. దుబాయ్‌లో క్రికెట్‌పై ఆసక్తి కలిగిన యువతరానికి ఆమె శిక్షణ ఇవ్వనుంది. దాంతో, మంధాన కొత్త ప్రయాణం అద్భుతంగా కొనసాగాలని కోరుకుంటున్నారు అభిమానులు.
“What’s your favourite memory of playing cricket?”
A young fan asked Smriti Mandhana this heartfelt question — and her smile said it all before she even answered.
Watch her beautiful reaction! 👇#CityCricketAcademy #CCAbySmritiMandhana @citycricket @cricpredicta pic.twitter.com/jxnU4MRtRa— Indian Sports Fans. Fan Curated & Original (@IndianSportFan) April 18, 2025