దుబాయ్: భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన(Smriti Mandhana) .. వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో టాప్ ప్లేస్ కొట్టేసింది. తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకుల జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. 2019 తర్వాత భారత వైస్ కెప్టెన్ మందాన మళ్లీ ర్యాంకుల్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా వోల్వార్డ్.. ఇటీవల 19 పాయింట్లు కోల్పోయింది. దీంతో స్మృతి టాప్ వన్ నెంబర్ దిశగా దూసుకెళ్లింది. 727 రేటింగ్ పాయింట్లతో స్మృతి మందానా టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇంగ్లండ్ కెప్టెన్ నటాలీ స్కీవర్ బ్రంట్ 719 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉంది. వోల్వార్డ్ 719 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది. మందాన తర్వాత ర్యాంకు లిస్టులో ఉన్న ఇండియన్ బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ ఉన్నారు. ఆ ఇద్దరూ 14, 15వ స్థానాల్లో నిలుచున్నారు.
Star India batter reclaims her throne at the top in the latest ICC Women’s Player Rankings 🔥
Read more ⬇https://t.co/CFNuOGX2Kt
— ICC (@ICC) June 17, 2025