దుబాయ్ : భారత మహిళల స్టార్ క్రికెటర్ స్మృతి మందన తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటింది. మంగళవారం విడుదలైన ర్యాంకింగ్స్‌లో మందన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడు ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని 734 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు చేరుకుంది. రెండు ర్యాంక్‌లు చేజార్చుకున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ 13వ ర్యాంక్‌కు పడిపోయింది. ఇటీవల ఆస్ట్రేలియాతో ఆఖరి వన్డేలో సెంచరీ చేయడం ద్వారా మందన తన ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకుంది. మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లోనూ 741 పాయింట్లతో ఒక స్థానం ఎగబాకిన మందన మూడో ర్యాంక్‌కు చేరుకుంది.