బెంగళూరు : మహిళా ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ జట్టుకు ఏస్ బ్యాటర్ స్మృతి మందనను కెప్టెన్‌గా నియమిస్తూ శనివారం జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. భారత వైస్‌కెప్టెన్ అయిన మందనను ఆర్సీబీ రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వేలంలో ఇదే అత్యధిక ధర. దీనిపై ఐపీఎల్ ఆర్సీబీ ఆటగాళ్లు కోహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్ స్పందిస్తూ స్మృతి జట్టును సరైన బాటలో నడిపించగలదని, ఆమెకు జట్టు, అభిమానుల అండదండలు ఉంటాయని తెలిపారు. ఆమె నేతృత్వంలో ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.