షార్జా: దక్షిణాఫ్రికాతో పోరులో శ్రీలంక టాపార్డర్ తడబడింది. ఆన్రిచ్ నార్ట్జీ బౌలింగ్లో కుశాల్ పెరీరా (7) స్వల్పస్కోరుకే వెనుతిరగడంతో చరిత్ అసలంక (21) క్రీజులోకి వచ్చాడు. ఫామ్లో ఉన్న అతను ధాటిగా ఆడటంతో లంక భారీ స్కోరు చేస్తుందనిపించింది. కానీ దురదృష్టవశాత్తూ అతను రనౌట్ అయ్యాడు.
ఆ తర్వాత భానుక రాజపక్స (0) కనీసం ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. టబ్రాయిజ్ షాంసి బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి లంక 67/3 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో పాథుమ్ నిస్సంక (38 నాటౌట్), అవిష్క ఫెర్నాండో ఉన్నారు.