ఆదివారం 17 జనవరి 2021
Sports - Dec 19, 2020 , 18:40:19

2020లో విరాట్‌ కోహ్లీ జీరో సెంచరీలు

2020లో విరాట్‌ కోహ్లీ జీరో సెంచరీలు

అడిలైడ్‌: అంతర్జాతీయ క్రికెట్లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈ ఏడాదిలో  ఒక్క  సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో విరాట్‌(74, 4) అర్ధశతకంతో మాత్రమే రాణించాడు. 2020ని కోహ్లీ  సున్నా సెంచరీలతో  ముగించాడు. కొన్నేండ్లుగా అన్ని ఫార్మాట్లలోనూ టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్న కోహ్లీ ఈ ఒక్క సంవత్సరంలో మాత్రం మూడంకెల స్కోరు చేయలేకపోయాడు. కరోనా కారణంగా ఈ ఏడాదిలో చాలా రోజులు అంతర్జాతీయ క్రికెట్‌  నిలిచిపోయింది. 

అంతర్జాతీయ అరంగేట్రం తర్వాత శతకం లేకుండా ఏడాదిని ముగించడం ఇదే మొదటిసారి.2020లో కోహ్లీ అత్యధిక స్కోరు 89.  2020లో కోహ్లీ 9 వన్డేలు, 10టీ20లు, మూడు టెస్టులు ఆడాడు.  బాక్సింగ్‌ డే టెస్టు మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరగనుండా కోహ్లీ మాత్రం తన భార్య అనుష్క శర్మ బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో స్వదేశానికి తిరిగొస్తున్నాడు.   దీంతో 2008 తర్వాత తొలిసారి సెంచరీ లేకుండానే ఈ ఏడాదిని ముగించేశాడు.