హైదరాబాద్, ఆట ప్రతినిధి: జీఎంఆర్ స్పోర్ట్స్ సికింద్రాబాద్ క్లబ్ యూత్ ఓపెన్ రెగట్టా చాంపియన్‌షిప్ సోమవారం హుస్సేన్ సాగర్‌లో మొదలైంది. వారం రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 113 మంది సెయిలర్లు బరిలో నిలిచారు.
యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వైఏఐ) జాతీయ సీనియర్, జూనియర్ ర్యాంకింగ్ ఈవెంట్ హోదా ఉండటంతో ఈ టోర్నీ ఫలితాలు జాతీయ ర్యాంకింగ్స్‌లోకి లెక్కలోకి వస్తాయని సికింద్రాబాద్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం నుంచి మెయిన్ రౌండ్ పోటీలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.