అయిజ, జూన్ 26 : గద్వాల జిల్లా అయిజ మండలం మేడికొండకు చెందిన విద్యార్థిని శిరీష జాతీయ స్థాయి కబడ్డీ టోర్నీకి ఎంపికైంది. ఈనెల 28 నుంచి జూలై ఒకటో తేదీ వరకు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరగనున్న అండర్-18 నేషనల్ టోర్నీలో ఆమె తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నది.
ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు కబడ్డీ అకాడమీలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చి ఆమె.. జాతీయ టోర్నీకి ఎంపికైంది. రంగారెడ్డి జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఆమె ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. పుష్పావతి, జలపతి వెంకటేశ్‌గౌడ్ దంపతుల కుమార్తె అయిన శిరీష చిన్ననాటి నుంచి క్రీడల్లో ప్రతిభ చాటుతూ గౌలిదొడ్డిలోని సీవోఈలోని అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నది.