IPL 2025 : ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ల వైఫల్యం కొనసాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సన్‌రైజర్స్‌కు గుజరాత్ టైటన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. అతడి విజృంభణతో ట్రావిస్ హెడ్(8), అభిషేక్ శర్మ(18)లు పెవిలియన్ చేరారు. దాంతో, ఆరెంజ్ ఆర్మీ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఇషాన్ కిషన్(15), నితీశ్ కుమార్ రెడ్డి(2)లు క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 45-2.
టాస్ గెలుపొందిన సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే డేంజరస్ ట్రావిస్ హెడ్ (8)ను లెగ్త్ బాల్ వేసి ఔట్ చేశాడు సిరాజ్. సాయి సుదర్శన్ చక్కని క్యాచ్ పట్టడంతో హెడ్ పెవిలియన్ చేరాడు. 9 పరుగులకే వికెట్ పడినా.. ఓపెనర్ అభిషేక్ శర్మ(18) దూకుడుగా ఆడాడు. ఇషాంత్, సిరాజ్ బౌలింగ్‌లో రెండేసి బౌండరీలతో ఫామ్‌లోకి వచ్చినట్టే కనిపించాడు. కానీ, సిరాజ్ వేసిన మూడో ఓవర్లో తెవాటియాకు సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.