ముంబై: వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మహ్మద్ సిరాజ్ కళ్లుచెదిరే బంతులతో తన వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టాడు. మూడో ఓవర్లో జోస్ బట్లర్(8)ను బౌల్డ్ చేసిన సిరాజ్..ఐదో ఓవర్లో డేవిడ్ మిల్లర్‌ను పెవిలియన్ పంపాడు. జేమీసన్ కూడా నాలుగో ఓవర్లో మనన్ వోహ్రా(7)ను ఔట్ చేశాడు. దీంతో రాజస్థాన్ 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ సంజూ శాంసన్(12) నిలకడగా ఆడుతున్నాడు. మరో ఎండ్‌లో శివమ్ దూబే(4) ఉన్నాడు. పవర్‌ప్లే ఆఖరికి రాజస్థాన్ 3 వికెట్లకు 32 పరుగులు చేసింది.
#RR lose three wickets in the powerplay with 32 runs on the board.
— IndianPremierLeague (@IPL) April 22, 2021
Live – https://t.co/dch5R4juzp #RCBvRR #VIVOIPL pic.twitter.com/BUzGazwPgG