IND vs SA | ఈ నెల 14న నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్నది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి మ్యాచ్ జరుగనున్నది. డిఫెండింగ్ వరల్డ్ టెస్ట్ చాంపియన్ (WTC) దక్షిణాఫ్రికాపై మెరుగైన ప్రదర్శన చేయాలని టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ భావిస్తున్నాడు. సిరాజ్ భారత బౌలింగ్ లైనప్‌కు నాయకత్వం వహించనున్నాడు. టాప్ టెస్ట్ ర్యాంకర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి బౌలింగ్ భారం మోయబోతున్నాడు. 2025-27 ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ సైకిల్ అత్యధిక వికెట్లు తీసిన ఈ హైదరాబాద్ బైలర్ స్వదేశంలో జరుగనున్న టెస్ట్ సిరీస్‌లో తనదైన ముద్రవేయాలని భావిస్తున్నాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత జట్టు మూడోస్థానంలో ఉంది.
ఈ సైకిల్ ప్రారంభంలో స్వదేశంలో జరిగిన టెస్టుల్లో భారత జట్టు వెస్టిండిస్‌ను ఓడించడంతో పాటు ఇంగ్లండ్‌తో జరిగిన ఐదుటెస్టుల 2-2తో సిరీస్‌ను సమం చేసింది. అదే సమయంలో దక్షిణాఫ్రికా పాకిస్తాన్‌తో జరిగిన 1-1తో డ్రాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్‌ని సాధించింది. ఈ సిరీస్ WTC సైకిల్లో కీలకమైంది తెలిపాడు. దక్షిణాఫ్రికా డిఫెండింగ్ చాంపియన్స్ కాబట్టి.. పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్నప్పటికీ.. ఆ జట్టుపై రాణిస్తామని సిరాజ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీమిండియా మంచి ఫామ్‌లోనే ఉందని తెలిపాడు. ఇంగ్లండ్‌పై రాణించడంతోపాటు వెస్టిండీస్ సిరీస్‌ను గెలిచామని సిరాజ్ జియోస్టార్‌తో చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోనూ సిరాజ్ అద్భుతంగా రాణించాడు. 23 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. వెస్టిండీస్‌పై సైతం అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. రెండు మ్యాచుల్లో పది వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. సవాల్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిరాజ్ తెలిపాడు.