French Open : ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్(French Open 2024) మే 27 సోమవారం ప్రారంభమైంది. టోర్నీ మొదటి రోజే అంచనాలకు తగ్గట్టే టాప్ సీడ్సో అదరగొడుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో జన్నిక్ సిన్నర్(Janik Sinner) రెండో రౌండ్‌కు దూసుకెళ్లగా.. మహిళల విభాగంలో వరల్డ్ నంబర్ 1 ఇగా స్వియటెక్(Iga Swiatek) రఫ్ఫాడించింది. క్వాలిఫయర్ లియోలియా జీన్జీన్ను మట్టికరిపించి రెండో రౌండ్లో నవామి ఒసాకా(Naomi Osaka)తో అమీతుమీకి సిద్దమైంది.
ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీ విజేత అయిన సిన్నర్ మట్టికోర్టులో దుమ్మురేపాడు. తొలి రౌండ్లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ యుబాంక్స్(Christopher Eubanks)ను చిత్తుగా ఓడించాడు. వరుసగా మూడు సెట్లలో ఆధిపత్యం చెలాయించి 6-3, 6-3, 6-4తో గెలుపొందాడు. తర్వాతి రౌండ్లో అతడు వైల్డ్ కార్డు ఎంట్రీ సాధించిన రిచర్డ్ గాస్కెట్‌తో తలపడనున్నాడు.