Women’s World Cup | ఐసీసీ వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం టైటిల్ మ్యాచ్ జరుగనున్నది. తొలిసారిగా విజేతగా నిలువాలని రెండుజట్లు ఉత్సాహంతో ఉన్నాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన మహిళ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు.. నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం సిద్ధమైంది. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రముఖ సినీ నేపథ్య గాయని సునిధి చౌహాన్ అలరించనున్నది. తన పాటలతో ప్రేక్షకులతో పాటు క్రికెటర్లను సైతం సునిధిని అలరిస్తారని ఐసీసీ ప్రకటించింది.
అదే సమయంలో స్టేడియం అద్భుతమైన లేజర్ షో అలరించనున్నది. 350 మందితో ప్రదర్శనతో పాటు డ్రోన్ ప్రదర్శన అలరించనున్నది. ఇదిలా ఉండగా రెండుదేశాల మధ్య జరిగిన 34 వన్డేలు జరగ్గా.. 20 విజయాలతో పైచేయి సాధించింది. ప్రపంచ కప్‌లో గట్టిపోటీ ఉండనున్నది. ఆరు వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో భారత్ మూడు విజయాలు సాధించింది. కానీ, దక్షిణాఫ్రికా గత మూడు మ్యాచ్‌ల్లో భారత్‌ను ఓడించింది. 2017 తర్వాత ఈ గ్లోబల్ ఈవెంట్లో భారత్ ఓడిపోని ఏకైక జట్టు దక్షిణాఫ్రికా. ప్రపంచ కప్ చరిత్రలో ఆస్ట్రేలియా (ఎనిమిది), న్యూజిలాండ్ (ఐదు) మాత్రమే ఇంతకు ముందు కంటే ఎక్కువ సార్లు వరుస మ్యాచుల్లో భారత్‌ను ఓడించాయి. కాబట్టి భారత జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో వరుసగా మూడు సార్లు ఓడిపోయినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.