హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఆలిండియా మైన్స్ రెస్క్యూ పోటీల్లో సింగరేణి రెస్క్యూ టీమ్‌లు సత్తాచాటాయి. నాగపూర్‌లో జరిగిన ఈ పోటీల్లో పురుషుల జట్టు విజేతగా నిలిచింది. మహిళల జట్టు ద్వితీయ స్థానంలో నిలువగా, మొత్తంగా 20 బహుమతులను సింగరేణి జట్లు గెలుచుకున్నాయి.
ఈ సందర్భంగా సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ రెడ్‌హిల్స్‌లోని సింగరేణి భవన్లో రెస్యూ బృందాలను అభినందించారు. త్వరలో జాంబియాలో జరిగే అంతర్జాతీయ స్థాయి మైన్స్ రెస్య్యూ పోటీల్లోను సత్తాచాటాలని సీఎండీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వెంకటేశ్వర్లు, రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.