PV Sindhu | నేటి నుంచి సింగపూర్ ఓపెన్.. సింధు రెండేండ్ల నిరీక్షణ ముగిసేనా?
‘బ్యాడ్మింటన్ సూపర్' టోర్నీ టైటిల్ కోసం రెండేండ్లుగా ఎదురుచూస్తున్న డబుల్ ఒలింపియన్ పీవీ సింధు.. తనకు అచ్చొచ్చిన సింగపూర్ ఓపెన్‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
- సాత్విక్-చిరాగ్ జోడీ పునరాగమనం
PV Sindhu | సింగపూర్: ‘బ్యాడ్మింటన్ సూపర్’ టోర్నీ టైటిల్ కోసం రెండేండ్లుగా ఎదురుచూస్తున్న డబుల్ ఒలింపియన్ పీవీ సింధు.. తనకు అచ్చొచ్చిన సింగపూర్ ఓపెన్‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మంగళవారం నుంచి సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నీకి తెరలేవనున్న నేపథ్యంలో 2022లో ఇక్కడే విజేతగా నిలిచిన సింధు.. నాటి ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తోంది. ఏడాది తర్వాత ‘సూపర్’ సిరీస్ ఫైనల్ చేరిన సింధు.. మలేషియా మాస్టర్స్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు సింధుకు ఈ టోర్నీ చాలా కీలకం.
తొలి రౌండ్లో భాగంగా బుధవారం ఆమె.. డానిష్ షట్లర్ లినెతో పోటీ పడనుంది. మహిళల విభాగంలో సింధుతో పాటు ఆకర్షి కశ్యప్, డబుల్స్‌లో అశ్విని-తనీషా బరిలో ఉన్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్యసేన్, ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ సత్తాచాటాలని భావిస్తున్నారు. పురుషుల డబుల్స్‌లో స్టార్ షట్లర్లు సాత్విక్- చిరాగ్ స్వల్ప విరామం తర్వాత మళ్లీ కోర్టులోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే థాయ్‌లాండ్ ఓపెన్ గెలిచి తిరిగి ప్రపంచ నంబర్‌వన్ స్థానం దక్కించుకున్న భారత ద్వయం ఇక్కడా మెరిసేందుకు సిద్ధమయ్యారు. విశ్వక్రీడలకు సన్నద్ధమవుతున్న భారత షట్లర్లకు సింగపూర్ ఓపెన్ మంచి సన్నాహకంగా మారనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

