షెన్జెన్ (చైనా) : భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తమ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ చైనా మాస్టర్స్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. గురువారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో భారత ద్వయం.. 21-13, 21-12తో చైనీస్ తైఫీ జోడీ సియాంగ్ చెచి, వాంగ్ చి-లిన్‌ను ఓడించింది.
32 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించిన సాత్విక్ జంట.. వరుస గేమ్స్‌ను గెలుచుకుని మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం సాధించింది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు.. 21-15, 21-15తో థాయ్‌లాండ్ షట్లర్ చొచువాంగ్‌ను మట్టికరిపించింది. ఇటీవల ముగిసిన హాంకాంగ్ ఓపెన్‌లో తొలి రౌండ్‌కే ఇంటిబాట పట్టిన ఆమె.. చైనా మాస్టర్స్‌లో మాత్రం ఆ తప్పిదాలకు తావివ్వకుండా క్వార్టర్స్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో ఆమె కొరియా షట్లర్ అన్ సె యంగ్‌తో తలపడనుంది.