IPL 2025 : ఉప్పల్ స్టేడియంలో ఇషాన్ కిషన్(106 నాటౌట్) మెరుపు సెంచరీతో కొండంత స్కోర్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్రత్యర్థిని ఆది నుంచే కట్టడి చేస్తోంది. పేసర్ సిమర్జిత్ విజృంభణతో భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కు పెద్ద షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే ఆ జట్టు 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఆపై షమీ చెలరేగగా.. 50కే మూడు వికెట్లు పడ్డాయి. పవర్ ప్లేలో రాజస్థాన్ స్కోర్.. 77/3.
తొలి ఓవర్లో 16 పరుగులు రాబట్టిన రాజస్థాన్‌కు సిమర్జిత్ ఊహించని షాకిచ్చాడు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(1) కట్ షాట్ ఆడగా.. అభినవ్ మనోహర్ గాల్లోకి ఎగురుతూ చక్కని క్యాచ్ పట్టాడు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే కెప్టెన్ రియాన్ పరాగ్(4) పెద్ద షాట్‌కు ప్రయత్నించి కమిన్స్ చేతికి చిక్కాడు. దాంతో, 24 పరుగులకే ఇద్దరు ప్రధాన బ్యాటర్లు పెవిలియన్ చేరగా.. షమీ ఓవర్లో నితీశ్ నితీశ్ రానా(11) పేలవ షాట్ ఆడి కమిన్స్‌కు తేలికైన క్యాచ్ ఇచ్చాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సంజూ శాంసన్(33), ధ్రువ్ జురెల్(22)లు ధాటిగా ఆడుతున్నారు. కమిన్స్ వేసిన 6వ ఓవర్లో జురెల్ వరుసగా 6, 4, 4.. చివరి బంతికి లెగ్ సైడ్‌లో బౌండరీ బాదాడు. దాంతో.. జట్టు స్కోర్ 70 దాటింది. ఇంకా ఆ టీమ్ విజయానికి 210 పరుగులు కావాలి.
𝐒𝐭𝐫𝐢𝐤𝐞 𝐱 2️⃣
A double-wicket over from Simarjeet Singh on his #SRH debut gives them the perfect start 🔥
Updates ▶️ https://t.co/ltVZAvInEG#TATAIPL | #SRHvRR | @SunRisers pic.twitter.com/W8qpH7l4kw
— IndianPremierLeague (@IPL) March 23, 2025