సెమీస్‌లో సిక్కిరెడ్డి జోడీ
భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ సిక్కిరెడ్డి-రోహన్ కపూర్.. వియత్నాం ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
న్యూఢిల్లీ: భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ సిక్కిరెడ్డి-రోహన్ కపూర్.. వియత్నాం ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-100 టోర్నీ క్వార్టర్స్‌లో శుక్రవారం సిక్కిరెడ్డి-రోహన్ జంట 21-19, 21-17తో మూడో సీడ్ చాన్ పెంగ్ సూన్-చెహ్ యీ సీ (మలేషియా) ద్వయంపై గెలుపొందింది. గత వారం ఛత్తీస్‌గఢ్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టైటిల్ చేజిక్కించుకున్న ఈ జంట.. 39 నిమిషాల్లో ముగిసిన పోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఆట ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన భారత జోడీ.. వరుస గేమ్‌ల్లో విజయం సాధించింది. శనివారం జరుగనున్న సెమీస్‌లో ఇండోనేషియాకు చెందిన రెహాన్-లిసా జంటతో భారత ద్వయం అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతం ఈ టోర్నీలో భారత్ నుంచి సిక్కి-రోహన్ జంట మాత్రమే పోటీలో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

