హైదరాబాద్, ఆట ప్రతినిధి: నల్లగొండ ఫ్రీడమ్ అకాడమీ టీమ్ ఓపెనర్లు సిద్ధార్థ్ (121), సూర్య(86) విజృంభణతో ఎమ్మెస్కే రాకెట్స్ జట్టుపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మంగళవారం హైదరాబాద్లోని ఎమ్మెస్కే క్రికెట్ మైదానంలో జరిగిన వన్డే మ్యాచ్లో మొదట ఎమ్మెస్కే టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో నక్ష్(52), హర్ష్(61) అర్ధసెంచరీలతో 260/5 స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో సిద్ధార్థ్, సూర్య అదరగొట్టడంతో ఫ్రీడమ్ జట్టు 43.1 ఓవర్లలో 262/1 స్కోరు చేసింది. సెంచరీతో జట్టు విజయంలో కీలకమైన సిద్థార్థ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.