సొలో: భారత యువ షట్లర్లు తన్వి శర్మ, తెలుగమ్మాయి వెన్నెల కలగొట్ల బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ ఇండివిడ్యూవల్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలతో మెరిశారు. ఈ టోర్నీ చరిత్రలో ఇద్దరు భారత షట్లర్లు పతకాలు గెలవడం ఇదే ప్రథమం. సెమీస్‌లో వెన్నెల.. 15-21, 18-21తో లియు సి య (చైనా) చేతిలో ఓడింది.
రెండో సీడ్ పంజాబ్ అమ్మాయి తన్వి.. 13-21, 14-21తో యిన్ యి (చైనా) చేతిలో అపజయం పాలైంది. కాగా, 2012 తర్వాత (పీవీ సింధుకు స్వర్ణం) ఈ టోర్నీలో మహిళా షట్లర్లు పతకం గెలవడం ఇదే తొలిసారి. అంతేగాక 2018లో లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్‌లో పసిడి నెగ్గిన తర్వాత భారత్‌కు మెడల్ దక్కడం ఇదే మొదటిసారి. తన్వి, వెన్నెల కాంస్యాలతో ఈ టోర్నీని భారత్ రెండు పతకాలతో ముగించింది.