Paralympics 2024 : పారిలింపిక్స్లో భారత షట్లర్ నితీశ్ కుమార్ (Nitesh Kumar) పసిడి పతకం కొల్లగొట్టాడు. సోమవారం జరిగిన ఫైనల్లో నితీశ్ జయకేతనం ఎగురువేశాడు. దాంతో, పారిలింపిక్స్లో రెండో స్వర్ణం ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ పసిడి పోరులో నితీశ్ అదరగొట్టాడు. బ్రిటన్‌కు చెందిన డానియల్ బెథెల్(Daniel Bethell)ను మూడు సెట్లలో ఓడించి గోల్డ్ మెడల్ సాధించాడు. దాంతో, భారత్ ఖాతాలో రెండో స్వర్ణం చేరగా.. మొత్తంగా పతకాల సంఖ్య తొమ్మిదికి పెరిగింది.
పారిస్‌లో పతకమే లక్ష్యంగా పెట్టుకున్న నితీశ్ చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో డానియల్ బెథెల్‌ను మట్టికరిపించాడు. తొలి సెట్‌ను 21-14తో అలవోకగా గెలుపొందిన నితీశ్ రెండో సెట్ కోల్పోయాడు. అయితే.. నిర్ణయాత్మక మూడో సెట్లో పంజా విసిరిన భారత షట్లర్ ప్రత్యర్థికి చెమటలు పట్టించాడు. డానియల్ కూడా ఏమాత్రం తగ్గలేదు. అయితే.. చివరకు 23-21తో నితీశ్ గెలుపొందాడు.
Another historic moment for India!
Nitesh Kumar clinches Gold🏅 in men’s singles SL3 para-badminton at the Paris Paralympics!
Proud of his determination and skill! #Paralympics2024 #NiteshKumar #Paris2024 #Cheer4Bharat @mansukhmandviya @IndiaSports @MIB_India @PIB_India… pic.twitter.com/OcoqP0qgrV
— Doordarshan Sports (@ddsportschannel) September 2, 2024
పారాలింపిక్స్‌లో భారత డిస్కస్ త్రోయర్ యోగేశ్ కథునియా (Yogesh Kathuniya) రజతంతో మెరిశాడు. సోమవారం జరిగిన ఫైనల్లో 22 ఏండ్ల ఈ అథ్లెట్.. డిస్కస్‌ను తొలి ప్రయత్నంలోనే డిస్సస్ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. ఈ పోటీల్లో బ్రెజిల్‌కు చెందిన క్లాడినె బతిస్తా హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించాడు. పారిస్‌లో క్లాడినె డిస్కస్‌ను 46.86 మీటర్ల దూరం విసిరి స్వర్ణం కొల్లగొట్టాడు.
యోగేశ్ కథునియా
పారిస్‌లో భారత షూటర్ అవని లేఖరా(Avani Lekhara) గోల్డ్ మెడల్‌తో బోణీ కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మోనా అగర్వాల్, మనీశ్ నర్వాల్‌లు కాంస్యంతో మెరిశారు. అనంతరం 100 మీటర్ల రేసులో ప్రీతి పాల్(Preethi Paul) కంచు మోత మోగించింది. అంతేకాదు 200 మీటర్ల పోటీలోనూ ప్రీతి కాంస్యం కొల్లగొట్టింది. శనివారం జరిగిన 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్ రజతంతో మెరిసింది.
అవని, మోనా, మనీశ్ నర్వాల్, ప్రీతి