ముంబై: మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద బీజేపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే నితీశ్ రాణే (BJP MLA Nitesh Rane) మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగం చేశారు. ముస్లిం సమాజాన్ని ఆయన బెదిరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబరు 1న హిందూ ధర్మకర్త మహంత్ రామగిరి మహారాజ్‌కు మద్దతుగా శ్రీరాంపూర్, తోప్‌ఖానా ప్రాంతాల్లో జరిగిన బహిరంగ కార్యక్రమాల్లో బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే ప్రసంగించారు. హిందువులను దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. ‘రామగిరి మహారాజ్‌కు హాని చేసే ధైర్యం మీకు ఉంటే, మీ మసీదులోకి మేం ప్రవేశిస్తాం. మిమ్మల్ని వేటాడి చంపుతాం’ అని అన్నారు.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే మాట్లాడిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయన ప్రసంగంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అహ్మద్‌నగర్ పోలీసులు స్పందించారు. నితీష్ రాణేపై రెండు కేసులు నమోదు చేశారు.