Duleep Trophy : సీనియర్లు లేకుంటేనేం ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సమం చేసిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్‌గా నూరు మార్కులు కొట్టేశాడు. నాయకుడిగా ముందుండి నడిపిస్తూ.. తనకిచ్చిన స్క్వాడ్‌ను సమర్ధంగా ఉపయోగించుకొని ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనిపించుకున్నాడు. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీని పంచుకున్న ఉత్సాహంతో స్వదేశం వచ్చిన గిల్‌కు మళ్లీ కెప్టెన్ బాధ్యతలు అందుకున్నాడు.
దేశవాళీ సీజన్లో అతడు నార్త్ జోన్ (North Zone) సారథిగా ఎంపికయ్యాడు. దులీప్ ట్రోఫీ (Duleep Trophy) కోసం గురువారం సెలెక్టర్లు గిల్ నాయకత్వంలో 15 మందితో కూడిన బృందాన్ని ప్రకటించారు. ఆగస్టు నెలాఖర్లో దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. జోన్ల ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నీలో గిల్ కెప్టెన్సీలో నార్త్ జోన్ టైటిల్ వేటకు సిద్ధమవుతోంది. సెలెక్టర్లు ఎంపిక చేసిన స్క్వాడ్‌లో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానాలతో పేస్ దళం పటిష్టంగా ఉంది. ఒకవేళ ఈ గిల్ ఆసియా కప్ (Asia Cup) ఆడాల్సి వస్తే శుభం రొహిల్లా నార్త్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని సెలెక్టర్లు తెలిపారు.
A replacement has been named as well incase Shubman Gill gets picked for the Asia Cup T20s
Read more: https://t.co/PWFcduStki pic.twitter.com/RkwEZ1CTDY
— ESPNcricinfo (@ESPNcricinfo) August 7, 2025
నార్త్ జోన్ స్క్వాడ్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), శుభం ఖజురియా, అంకిత్ కుమార్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదొని, యశ్ దయాల్, అంకిత్ కల్సి, నిశాంత్ సింధు, సాహిల్ లొత్రా, మయాంక్ దగర్, యధ్వీర్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, అన్షుల్ కంభోజ్, అఖీబ్ నబీ, కన్హయ్య వధావన్ (వికెట్ కీపర్).
రీప్లేస్మెంట్స్ : ఒకవేళ గిల్, అర్ష్‌దీప్, హర్షిత్‌లు ఆసియాకప్ స్క్వాడ్‌కు ఎంపికైతే వీళ్ల స్థానాన్ని భర్తీ చేసేందుకు ముగ్గురిని ఎంపిక చేశారు సెలెక్టర్లు. శుభం రొహిల్లా (గిల్), గుర్నూర్ (అర్ష్‌దీప్ సింగ్), అనుజ్ థక్రాల్ (హర్షిత్ రానా).
స్లాండ్ బైస్ : శుభం అరోరా, జస్కరణ్వీర్ సింగ్, రవి చౌహన్, అబిడ్ ముస్తాక్, నిషంక్ బిర్లా, ఉమర్ నజీర్, దివేవ్ శర్మ.
ఇంగ్లండ్ పర్యటనతో టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న గిల్ అంచనాలకు మించి రాణించాడు. సీనియర్లు లేనిలోటు కనిపించినా.. జట్టు ప్రదర్శన మాత్రం ఇసుమంతైనా తగ్గకుండా చూసుకున్నాడు. లీడ్స్‌లో ఓటమితో సిరీస్ ఆరంభించినా పట్టువదలక బర్మింగ్హమ్లో రికార్డు విజయంతో సిరీస్ సమం చేసింది గిల్ సేన. ఆ మ్యాచ్‌లో రెండు శతకాలతో చెలరేగాడు గిల్. అనంతరం లార్డ్స్‌లో అసమానంగా పోరాడినా 21 పరుగుల దూరంలో ఆగిపోయింది భారత్.
ఇక మాంచెస్టర్‌లో సున్నాకే రెండు వికెట్లు పడిన వేళ కెప్టెన్ గిల్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో పాటు క్రీజులో పాతుకుపోయాడు. చివరిరోజు సుందర్, జడ్డూల శతకాలతో డ్రాగా ముగిసిందా టెస్టు. నిర్ణయాత్మక ఓవల్ టెస్టులో టీమిండియా యశస్వీ సెంచరీ.. సిరాజ్ సూపర్ స్పెల్ కారణంగా అద్భుత విజయంతో సిరీస్ సమం చేసింది. ఎన్నో అనుమానాల నడుమ జట్టును గొప్పగా నడిపించిన గిల్ బ్యాటర్‌గా 754 రన్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పట్టేశాడు.