కాన్బెరా: ఇండియన్ ఓపెనింగ్ బ్యాటర్ శుభమన్ గిల్(Shubman Gill).. మళ్లీ బ్యాట్ పట్టాడు. కాన్బెరాలో ఇవాళ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఇటీవల అతనికి బొటన వేలుకు గాయం అయ్యింది. ఆ గాయం నుంచి అతను కోలుకున్నాడు. గాయం వల్ల పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు అతను దూరం అయ్యాడు. అయితే ఇవాళ ప్రాక్టీస్‌లో పాల్గొనడం వల్ల.. అతను రెండో టెస్టులో ఆడే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. తొలి టెస్టులో 295 రన్స్ తేడాతో భారత్ నెగ్గడం వల్ల.. గిల్ అవసరం పెద్దగా తెలియలేదు.
Shubman Gill hits the nets for the first time since his thumb injury that forced him to miss the Perth Test.
Here’s how the star batter is shaping up! #TeamIndia | #AUSvIND | @ShubmanGill pic.twitter.com/sZtbvQhgLn
— BCCI (@BCCI) November 29, 2024
ప్రాక్టీస్ సెషన్లో యశ్ దయాల్, ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో గిల్ ప్రాక్టీస్ చేశాడు. శనివారం నుంచి కాన్బెరాలో ఆస్ట్రేలియా ప్రైమ్‌మినిస్టర్స్ లెవన్ జట్టుతో భారత్ తలపడనున్నది. గిల్ గైర్హాజరీలో దేవదత్ పడిక్కల్.. అతని స్థానంలో ఫస్ట్ టెస్టులో ఆడాడు. కానీ పడిక్కల్ భారీ స్కోరు చేయడంలో విఫలం అయ్యాడు. ఒకవేళ రెండో టెస్టుకు గిల్ సిద్దమైతే, అప్పుడు బ్యాటింగ్ పొజిషన్స్‌లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ టెస్టులో ఓపెనర్‌గా రాహుల్ కొంత వరకు రాణించాడు.
కానీ పెర్త్ టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరు కావడంతో.. ఇప్పుడు రెండో టెస్టులో ఆ ప్లేస్ కీలకం కానున్నది. జైస్వాల్‌తో రోహిత్ ఓపెనింగ్ చేసే ఛాన్సు ఉన్నది. ఇక వన్‌డౌన్‌లో రాహుల్ వస్తాడనుకుంటున్నారు. అదే జరిగితే గిల్ అయిదో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. పీఎం లెవన్‌తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో.. ఒవకేళ భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో ఏదైనా మార్పులు చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.