Shubman Gill | దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నంబర్‌వన్ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. పాకిస్థాన్ మాజీ సారథి బాబర్ ఆజమ్‌ను అధిగమించిన గిల్.. 796 పాయింట్లతో ఫస్ట్ ర్యాంకు దక్కించుకున్నాడు.
ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు, ఓ సెంచరీ చేయడంతో అతడి ర్యాంకింగ్ మెరుగైంది. ఈ జాబితాలో రోహిత్ మూడో ర్యాంక్‌లో ఉండగా కోహ్లీ ఆరు, శ్రేయస్ తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు. బౌలర్ల విషయానికొస్తే లంక స్పిన్నర్ తీక్షణ అగ్రస్థానంలో ఉండగా భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ నాలుగో స్థానంలో చోటు దక్కించుకున్నాడు.